ముగించు

మూడు నెలల్లో కొడంగల్ రూపురేఖలు మారుస్తాం : మంత్రి

ప్రచురణ తేది : 18/06/2020

3 నెలల్లో కొడంగల్ రూపు రేఖలు మారుస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం 17.06.2020 న నందారం నుండి బాపల్లి తాండా వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు ఆమె శంఖుస్థాపన చేశారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గానికి, రోడ్లు మరియు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఇప్పటివరకు 225 కోట్ల రూపాయలు మంజూరు చేసారని, వాటికి సంభందించిన పనులు పూర్తికావొచ్చాయని తెలిపారు. డిగ్రీ కళాశాల, కోస్గిలో బస్సు డిపో, దౌలతాబాద్ లో జూనియర్ కళాశాల, మినీ ట్యాంకుబండ్ నిర్మాణాలను సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్యం లోపించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు . జిల్లాలో నదులు లేకపోవడంతో, ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు.

కొడంగల్‌లో మంత్రి పనులు ప్రారంభించారు